నితిన్ డైరెక్టర్‌కి నో చెప్పిన మెగాస్టార్: చిరును ఇంప్రెస్ చేయలేకపోయాడా.?

- May 26, 2022 , by Maagulf
నితిన్ డైరెక్టర్‌కి నో చెప్పిన మెగాస్టార్: చిరును ఇంప్రెస్ చేయలేకపోయాడా.?

‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాకి కమిట్ అయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రొడ్యూసర్ డి.వి.వి.దానయ్య ఈ సినిమాని నిర్మించాల్సి వుంది. అయితే ఆ ప్రాజెక్టు ఇప్పుడు వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.

అందుకు కారణం వెంకీ కుడుముల నెరేట్ చేసిన స్టోరీ చిరంజీవికి నచ్చలేదట. ఆ స్టోరీలో కొన్ని మార్పులు సూచించారడట చిరంజీవి. మార్పులు చేసి, రెండోసారి మళ్లీ చిరంజీవి వద్దకు వెళ్లాడట వెంకీ కుడుముల. రెండోసారి కూడా చిరంజీవిని ఇంప్రెస్ చేయలేకపోయాడట వెంకీ కుడుముల.

ఇంతకు ముందులా అయితే, చిరంజీవి ఓకే చేసేవాడేనేమో. కానీ, ‘ఆచార్య’ ఫలితం చిరంజీవిని చాలా మార్చేసింది. నమ్మి ప్రాజెక్ట్ అప్పచెప్పితే కొరటాల మోసం చేశాడనే అనుమానాలు చిరంజీవి సన్నిహితుల్లో వున్నాయ్. చిరంజీవి సతీమణి సురేఖ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఆచార్య’.

అలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ విషయంలో కొరటాల శివ అంత నిర్లక్ష్యంగా ఎలా వున్నారు.? డైరెక్టర్‌పై నమ్మకంతో, అటు చిరు గానీ, ఇటు చరణ్ గానీ ఎక్కడా వేలు పెట్టి కెలకలేదు. అది కూడా ‘ఆచార్య’ డిజాస్టర్‌కి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.

అందుకే ఇకపై అలాంటి రిస్క్ జోలికి పోకూడదనుకుంటున్నాడట చిరంజీవి. ఆచి తూచి వ్యవహరించాలనుకుంటున్నాడట. అలా వెంకీ కుడుముల బుక్ అయిపోయాడన్న మాట. అలా అని, పూర్తిగా వెంకీని డిజప్పాయింట్ చేయలేదట చిరంజీవి. కమిట్మెంట్ అయితే అలాగే వుంది. కానీ, కథ విషయంలోనే కాస్త పునరాలోచన చేసుకోవాలని వెంకీ కుడుములతో చెప్పాడట చిరంజీవి. అదీ సంగతి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com