లైసెన్స్‌లేని డ్రైవింగ్‌కి 3 నెలల జైలు, 5000 దిర్హామ్‌ల ఫైన్
- April 07, 2016
అబుదాబీ పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ ట్రాఫిక్ నిబంధనల్ని ఇక నుంచి మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. అభ్యంతకరమైన ప్రవర్తన, 18 ఏళ్ళలోపు వయసున్నవారు అల్ అయిన్ సిటీలో డ్రైవింగ్, భారీ శబ్ధంతో వాహనాలు నడపడం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను మాడిఫై చెయ్యడం, సౌండ్ పెంచడం, అతి వేగంగా వాహనాల్ని నడపడం, రాత్రి వేళల్లో ఇబ్బందికరమైన రీతిలో వాహనాల్ని నడిపి ఇతరులకు ఇబ్బంది కల్పించడం వంటి వాటి పట్ల సీరియస్‌గా వ్యవహరించనున్నారు అబుదాబీ పోలీస్. డ్రైవింగ్ లేకుండా వాహనాల్ని నడిపితే 5000 దిర్హామ్‌ల ఫైన్, మూడు నెలల జైలుశిక్ష తప్పదని అబుదాబీ పోలీసులు హెచ్చరించారు. తీవ్రమైన శబ్దంతో వాహనాల్ని నడిపితే 500 దిర్హామ్‌ల ఫైన్ విధిస్తారు. నెల రోజుల జైలు శిక్ష కూడా ఉంటుంది. లైసెన్స్ లేని యంగ్‌స్టర్స్ వాహనాల్ని నడిపితే, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు వాహన యజమానికీ, తల్లిదండ్రులకూ శిక్ష తప్పదని హెచ్చరించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







