యూఏఈలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి

- May 30, 2022 , by Maagulf
యూఏఈలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి

యూఏఈ: పెరుగుతున్న ఇంధన ధరలతో యూఏఈ  నివాసితులు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల (EVల) పట్ల మొగ్గు చూపుతున్నారు. ఆడి అబుదాబి నిర్వహించిన సర్వే ప్రకారం..దాదాపు 52 శాతం నివాసితులు ఈవీ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. చమురు ధరలు బ్యారెల్‌కు $100 కు మించి పెరగడంతో యుఏఈలో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పెట్రోల్ ధరలు క్రమంగా పెరగడం కూడా దీనిక ఒక కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నివాసితులు ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో మరిన్ని ఈవీ మోడల్స్ కోసం తాము వేచి ఉన్నట్లు దాదాపు 25% మంది పేర్కొన్నారు. 14%  మంది తాము ఇటీవలే పెట్రోల్ కారును కొనుగోలు చేశామని, అయితే దానికి బదులుగా హైబ్రిడ్/ఈవీని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com