సీక్రెట్ లవ్వాయణం : సింగిలా.? మింగిలా.? అర్ధం కావడంలేదంటోన్న అనుపమ
- May 30, 2022
‘ప్రేమమ్’ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ లవ్‌లో పడిందట. అనుపమ ఇష్టపడిన వ్యక్తి ఎవరు.? అంటే అది మాత్రం సీక్రెట్ అంటోందండోయ్. తన లవ్వు గురించి ఇంట్లో వాళ్లకి కూడా తెలుసట. అయితే ఇంకేముంది. అంతా కుదిరితే, పెళ్లి చేసేసుకుంటుందా? అనుకుంటున్నారా.? అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్టుంది.
అది ప్రేమో, ఏమో తెలియడం లేదంటోంది అనుపమ పరమేశ్వరన్. అంతేకాదు, తాను సింగిలా.? మింగిలా.? అని కూడా అర్ధం కావడం లేదంట. అరెరే, పెద్ద చిక్కే వచ్చి పడిందే. ఇదేదో వన్ సైడ్ లవ్వు యవ్వారంలా వున్నట్లుంది కదా. అయినా అనుపమ ఏమన్నా చిన్నపిల్లా.? ప్రేమ గురించి తెలియకపోవడానికి అని అనుకోకుండా వుండలేం మరి.
గతంలో క్రికెటర్ బుమ్రాతో అనుపమ ప్రేమాయణం సాగించిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కట్ చేస్తే వేరే అమ్మాయితో బుమ్రా పెళ్లయిపోయింది. దాంతో అప్పటికి ఆ ప్రచారాలకు చెక్ పడింది. ఆ తర్వాత అనుపమ కెరీర్‌లో బిజీ అయిపోయింది. లేటెస్టుగా స్లిమ్ అండ్ స్లీకీ లుక్స్‌లో కనిపిస్తూ అనుపమ సోషల్ మీడియా ఫ్యాన్స్‌ని తెగ కవ్విస్తున్న సంగతి తెలిసిందే.
హాట్ హాట్ ఫోటో సెషన్స్‌తో పాటు, తన పర్సనల్ ఇష్యూస్‌ని కూడా అప్పుడప్పుడూ నెట్టింట్లో షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. ఆ క్రమంలోనే ఇదిగో తన లవ్ స్టేటస్‌ని కూడా పోస్ట్ చేసింది. ఇంతకీ అనుపమ లవ్వు సంగతి ఏంటంటారా.? ఏమో అది ఆమెకే క్లారిటీ లేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే, మొన్నీ మధ్యనే ‘రౌడీ బాయ్స్’ సినిమాలో నటించిన అనుపమ, ప్రస్తుతం ‘కార్తికేయ 2’ సినిమాలో నటిస్తోంది. నిఖిల్ సిద్దార్ధ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్టులు చర్చల దశలో వున్నాయట.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







