సినిమా టిక్కెట్లపై డిస్కషన్స్: ప్రేక్షకుల కోరిక అదేనట
- May 30, 2022
‘పెరుగుట విరుగుట కోసమే’ అని పెద్దలు ఊరికే అనలేదు సుమీ. వాళ్లు పెంచారు, వీళ్లు పెంచారు.. అంటూ చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా, ఎవరికి నచ్చినట్లు వాళ్లు సినిమా టిక్కెట్ల ధరలు పెంచుకుంటూ వెళ్లిపోయారు. టైమ్ ఎప్పుడూ ఒకేలా వుండదు కదా.
కరోనా దెబ్బకి సినీ పరిశ్రమ విల విల్లాడిపోయింది. దాదాపు సినిమా చచ్చిపోయిందనుకున్న టైమ్‌లో వున్న కాసింత శక్తినీ కూడగట్టుకుని ఎలాగోలా మళ్లీ ఊపిరి తీసుకుంటోంది ప్రస్తుతం సినీ పరిశ్రమ. ఈ మధ్య సినిమా టిక్కెట్ల గురించి అక్కడక్కడా జరిగిన రచ్చ సంగతి తెలిసిందే.
జడివానలా స్టార్ట్ అయిన ఆ రచ్చ కాస్తా పెను తుపానుగా మారింది. పెరిగిన ధరలతో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు అస్సలు ఇష్టపడడం లేదు. పెద్ద సినిమాల విషయంలోనూ ఈ మధ్య ఈ దెబ్బ గట్టిగా తాకింది. దాంతో కొన్ని సినిమాలు మా సినిమాలకు టిక్కెట్ ధర పెంచడం లేదు.. అంటూ దండోరా వేసుకుని చెప్పుకోవల్సి వచ్చిన పరిస్థితి చూశాం.
ఇక, ఇప్పుడు ఇంకా చెయ్యి దాటిపోయింది. సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించాల్సిందే అంటూ ఆడియన్స్ నుంచి డిమాండ్లు వస్తున్నాయ్. వీకెండ్స్‌లో ఓ రేటు, వీక్ డేస్‌లో ఇంకో రేటు.. పెట్టుకోండని ఆర్డర్లు కూడా పాస్ చేస్తున్నారట. అసలు ధియేటర్‌కి వెళ్లి సినిమా చూసేందుకు జనం ఇష్టపడనే ఇష్టపడట్లేదంటేనే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్ధం చేసుకోవాలి.
ఓటీటీ వెర్షన్ వచ్చాకా, సినిమా హిట్ అయితే, మూడు వారాలకే ఓటీటీలో రిలీజవుతోంది. ఫ్లాప్ అయితే, వారానికే వచ్చేస్తుంది. దాంతో ఐదు వందలు ఖర్చు చేసి ధియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలని అస్సలు అనుకోవడం లేదు ఆడియన్స్. ఇదీ సినిమా పరిస్థితి. అందుకే మరి, పెరుగుట విరుగుట కోసం.. అని ఎప్పుడో చెప్పేశారు మన పెద్దలు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







