అధిష్టానం ఆదేశిస్తే తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తా – జయప్రద

- May 31, 2022 , by Maagulf
అధిష్టానం ఆదేశిస్తే తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తా – జయప్రద

హైదరాబాద్: బిజెపి నాయకురాలు , మాజీ ఎంపీ జయప్రద తన మనసులోని కోరికను బయటపెట్టింది. అధిష్టానం ఆదేశిస్తే తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని తెలిపింది. సోమవారం ఆమె హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఓ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ గెలుపునకు పాటుపడతానని చెప్పారు. తెలంగాణ, ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలు పాలనను గాలికి వదిలేశాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించిన తర్వాతే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆమె సూచించారు. స్వతహాగా తెలుగు మహిళను అయిన తనకు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ఆ దిశగా ముందుకు సాగుతానని తెలిపింది. మరి జయప్రద కోరిక బిజెపి అధిష్టానం తీరుస్తుందా అనేది చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com