కువైట్‌లో మంకీపాక్స్ కేసులు లేవు: మంత్రివర్గం

- June 01, 2022 , by Maagulf
కువైట్‌లో మంకీపాక్స్ కేసులు లేవు: మంత్రివర్గం

కువైట్: ఇప్పటివరకు కువైట్‌లో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని మంత్రివర్గం తెలిపింది. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని, కువైట్ లో మంకీపాక్స్ వైరస్ ను అరికట్టడానికి ఇప్పటికే కఠినమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ ఖలీద్ అల్-సయీద్ తెలిపారు. వైరస్ గురించి చర్చించడానికి సమావేశమైన క్యాబినెట్ మంకీపాక్స్ వ్యాప్తి, ప్రపంచ గణాంకాలను విశ్లేషించారు. వైరస్ పెరుగుతున్న దేశాల గురించి సమావేశంలో చర్చించారు. మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ల నివారణకు కువైట్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ ఖలీద్ అల్-సయీద్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com