అతి వేగంగా వెళ్లకపోయినా జరిమానా విధిస్తే ఏం చేయాలి?

- June 01, 2022 , by Maagulf
అతి వేగంగా వెళ్లకపోయినా జరిమానా విధిస్తే ఏం చేయాలి?

ప్రశ్న: నేను షార్జాలో నిబంధనలు అనుసరిస్తూ వాహనాన్ని అతి వేగంగా నడపకపోయినప్పటికి  ట్రాఫిక్ జరిమానా విధించడం జరిగింది.వేగంగా నడపలేదు కాబట్టి నేను ఈ జరిమానాను సవాలు చేయగల మార్గం ఉందా? అందుకు కావల్సిన పత్రాలు ఏమిటి ? 

సమాధానం: మీరు పైన పేర్కొన్న ప్రకారం, మీరు అతివేగంగా నడిపారు అనే అభియోగం మీద షార్జా పోలీసులు జరిమానా విధించారు. కాబట్టి మీరు ముందుగా ఈ అభ్యంతరాన్ని వారికి తెలియజేయండి.మీ అభ్యంతరం ప్రకారం ,తాము జరిమానా విధించిన వ్యవహారాన్ని వారు మరోసారి తమ నిఘా విభాగం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది.

ఒకవేళ మీ అభ్యర్థన స్వీకరించేందుకు పోలీసులు నిరాకరిస్తే, ఈ వ్యవహారం మీద షార్జా లోని ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ సహకారాన్ని పొందవచ్చు. ఇందు కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమతి పొంది షార్జా ట్రాఫిక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. 


మీ పై విధించిన జరిమానా వ్యవహారాన్ని తనిఖీ చేయమని కోర్టును అభ్యర్థించవచ్చు. అలాగే, ఈ కేసులో మీ వాదన నిజం అని నిరూపించేందుకు సంబంధిత పత్రాలను కోర్టులో సమర్పించాలి. ఈ వ్యవహారంలో మీకు కావాల్సిన మరిన్ని వివరాల కోసం షార్జా పోలీసులను మరియు షార్జా ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ ను సంప్రదించండి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com