ముంబైలో మళ్లీ కరోనా విజృంభణ
- June 01, 2022
ముంబై: ముంబైలో గతంలో కరోనా ఎంతగా విజృంభించిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ముంబైలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచింది.ముంబైలో పాజిటివిటీ రేటు 6 శాతానికి చేరిందని బృహాన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) బుధవారం తెలిపింది. 12-18 ఏళ్ల మధ్య వయసున్న వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని బీఎంసీ కోరింది.
అలాగే, అర్హులైన అందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని చెప్పింది. కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉందని, కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు తగినంతమంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉండచుకోవడంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని బీఎంసీ కోరింది. కాగా, ముంబైలో మంగళవారం 506 కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 6న 536 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కరోనా కేసులు మళ్లీ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ముంబైలో ఏప్రిల్‌లో నమోదైన కేసుల కంటే మేలో 100 శాతం కేసులు అధికంగా నమోదు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







