అసోసియేషన్ సమావేశాలకు నంబర్ వన్ గమ్యస్థానం దుబాయ్

- June 02, 2022 , by Maagulf
అసోసియేషన్ సమావేశాలకు నంబర్ వన్ గమ్యస్థానం దుబాయ్

దుబాయ్: అసోసియేషన్ సమావేశాలకు ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ గమ్యస్థానంగా దుబాయ్ పేరుపొందింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ కాంగ్రెస్ అండ్ కన్వెన్షన్ అసోసియేషన్ (ICCA) నివేదిక 2021 స్పష్టం చేసింది. అంతర్జాతీయ సంఘాలు నిర్వహించే సమావేశాల సంఖ్యకు సంబంధించి 2021లో దుబాయ్‌ని అగ్ర నగరంగా ICCA నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని ప్రముఖ సమావేశాల పరిశ్రమ ఎగ్జిబిషన్ అయిన IMEX ఫ్రాంక్‌ఫర్ట్ 2022 ఎడిషన్‌లో వ్యాపార కార్యక్రమాలను హోస్ట్ చేయడంలో దుబాయ్ తన విశిష్టతను నిలుపుకుందని తెలిపింది. COVID-19 మహమ్మారి తర్వాత వ్యక్తిగతంగా వ్యాపార కార్యక్రమాలను పునఃప్రారంభించిన మొదటి గమ్యస్థానాలలో దుబాయ్ ఒకటని, అక్టోబర్ 2020 నాటికి అంతర్జాతీయ సమావేశాలు, హాజరైన వారికి దుబాయ్ మెరుగైన ఆతిథ్యం ఇచ్చిందని నివేదికలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com