యూఏఈలో కొత్తగా నాలుగు మంకీపాక్స్ కేసులు
- June 02, 2022
యూఏఈ: కొత్తగా నాలుగు వైరల్ జూనోటిక్ వ్యాధి మంకీపాక్స్ కేసులు నమోదయినట్లు యూఏఈ ప్రకటించింది. దేశంలోని ఎపిడెమియోలాజికల్ సర్వైలెన్స్ సిస్టమ్లో భాగంగా ఈ కేసులు కనుగొనబడ్డాయని తెలిపింది. దీంతో యూఏఈలో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. నివాసితులు అన్ని భద్రత, నివారణ చర్యలను అనుసరించాలని, ప్రయాణిస్తున్నప్పుడు లేదా సమావేశాలలో భాగమైనప్పుడు తప్పనిసరిగా అన్ని భద్రతా చర్యలను కూడా పాటించాలని ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) సూచించింది. మంకీపాక్స్ అంటువ్యాధి అని అథారిటీ తెలిపింది. అయితే కోవిడ్-19తో పోల్చితే దాని వ్యాప్తి పరిమితమని పేర్కొంది. మంకీపాక్స్ సాధారణంగా స్వీయ-పరిమిత వ్యాధి అని, దీని లక్షణాలు రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







