యూఏఈలో కొత్తగా నాలుగు మంకీపాక్స్ కేసులు

- June 02, 2022 , by Maagulf
యూఏఈలో కొత్తగా నాలుగు మంకీపాక్స్ కేసులు

యూఏఈ: కొత్తగా నాలుగు వైరల్ జూనోటిక్ వ్యాధి మంకీపాక్స్ కేసులు నమోదయినట్లు యూఏఈ ప్రకటించింది. దేశంలోని ఎపిడెమియోలాజికల్ సర్వైలెన్స్ సిస్టమ్‌లో భాగంగా ఈ కేసులు కనుగొనబడ్డాయని తెలిపింది. దీంతో యూఏఈలో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. నివాసితులు అన్ని భద్రత, నివారణ చర్యలను అనుసరించాలని, ప్రయాణిస్తున్నప్పుడు లేదా సమావేశాలలో భాగమైనప్పుడు తప్పనిసరిగా అన్ని భద్రతా చర్యలను కూడా పాటించాలని ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) సూచించింది. మంకీపాక్స్ అంటువ్యాధి అని అథారిటీ తెలిపింది. అయితే కోవిడ్-19తో పోల్చితే దాని వ్యాప్తి పరిమితమని పేర్కొంది. మంకీపాక్స్ సాధారణంగా స్వీయ-పరిమిత వ్యాధి అని, దీని లక్షణాలు రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటాయని తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com