2024 వరకు 5వ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులు

- June 02, 2022 , by Maagulf
2024 వరకు 5వ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులు

కువైట్: 5వ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులు 2024 వరకు కొనసాగనున్నాయి. కొన్ని నెలల క్రితం ప్రవేశపెట్టిన ట్రాఫిక్ మళ్లింపు 2024 వరకు సాగనుంది. అల్-సుర్రా, అల్-రౌదా - అల్-సలామ్, అల్-సిద్దిక్ ప్రాంతాలకు ఎదురుగా 5వ రింగ్ రోడ్‌లోని డమాస్కస్ స్ట్రీట్ కూడలిలో ట్రాఫిక్ మళ్లింపులు మే 2024 వరకు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ సౌత్ సుర్రా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ - ఫేజ్ టూ పనుల్లో భాగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 5.20 శాతానికి చేరుకున్నాయని, మే 2024 నాటికి పూర్తి కావాల్సి ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com