పెట్రోల్ ఖర్చులను అదుపు చేసుకునేందుకు 6 చిట్కాలు

- June 02, 2022 , by Maagulf
పెట్రోల్ ఖర్చులను అదుపు చేసుకునేందుకు 6 చిట్కాలు

యూఏఈ:యూఏఈ చమురు ధరల కమిటీ పెట్రోల్ మరియు డిజిటల్ ధరలను పెంచడం జరిగింది.ఈ ధరలు జూన్ 2022 నుంచి అమల్లోకి వచ్చాయి. 

జూన్ 1వ తేదీ నుండి సూపర్ 98 లీటర్ పెట్రోల్ ధర మే నెలలో Dh 3.66 కాగా, జూన్ నుంచి Dh4.15. ప్రత్యేక 95 లీటర్ పెట్రోల్ ధర మే నెలలో Dh 3.55 కాగా, జూన్ నుంచి Dh 4.03.పెరిగిన ధరలతో పాటుగా 5 శాతం వ్యాట్ వేయడం జరిగింది. 

పెరిగిన ధరలతో డీలా పడకుండా మీ వాహనం యొక్క పెట్రోల్ ఖర్చులను అదుపు చేసేందుకు ఈ 6 చిట్కాలను పాటిస్తే చాలు: 

1. మీ ఇంటికి దగ్గర్లో  నివాసం ఉంటూ కార్లు ఉన్న మీ కొలీగ్స్ తో కలిసి ఒక ప్రణాళిక ప్రకారం ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లడం లేదా వంతులు వారీగా తమ తమ కార్లలో వారితో ప్రయాణిస్తూ పెట్రోల్ ఖర్చులను ఆదా చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా పర్యావరణానికి సైతం మంచిది. 

2. ఇంధన ఖర్చులను ఆదా చేసేందుకు ప్రజా రవాణాలో ప్రయాణించేలా ప్రణాళికలు తయారు చేసుకోండి.ఇలా చేయడం మీ సమయంతో పాటుగా డబ్బు ఆదా అవుతుంది.అంతేకాకుండా ట్రాఫిక్ సమస్యలు తగ్గుముఖం పడతాయి. 

3. దగ్గర్లోని సూపర్ మార్కెట్స్ కు వెళ్లేందుకు మీ వాహనాలలో కాకుండా నడిచి వెళ్లండి. ఇలా నడిచి వెళ్లడం ద్వారా మీ శారీరక మరియు మానసిక పునరుత్తేజానికి తోడ్పడుతుంది. 

4. ఒక వేళ మీరు సొంత కార్లు/ వాహనాల్లో ప్రయాణం చేయాలి అనుకుంటే చిన్న కార్లను/ వాహనాలను ఎంపిక చేసుకోండి. ఇవి పెట్రోల్ ఖర్చులను ఆదా చేస్తాయి. 

5. రోజువారిగా కార్లను వినియోగించడం ద్వారా ఇంజిన్ కండిషన్ మెరుగైన రీతిలో ఉండటంతో పాటుగా మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 

6. సరైన అవగాహనతో పాటుగా నిలకడైన వేగంతో వాహన చోదకం చేయడం మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ సమయంలో ఇంజిన్ ను ఆపివేయడం ద్వారా ఇంధనం ఆదా అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com