CDFD లో ఉద్యోగాలు...
- June 02, 2022
హైదరాబాద్: భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్(CDFD)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి టెక్నికల్ అసోసియేట్స్, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, కంప్యూటేషనల్ ల్యాబొరేటరీ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, జూనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ రిసెర్చ్ ఫెలో తదితర పోస్టులు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి డీఎంఎల్టీ, బీఎస్సీ,డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ,ఎండీ,ఎంఎస్ ఉత్తీర్ణత. సీఎ్‌స్‌ఐఆర్-యూజీసీ నెట్, గేట్ అర్హత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పంపాల్సి ఉంటుంది.దరఖాస్తులకు చివరి తేదీగా జూన్ 20, 2022 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్:http://http://www.cdfd.org.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







