కత్తితో దాడి చేసిన నైజీరియన్ వ్యక్తి...8 మందికి గాయాలు
- June 02, 2022
ముంబై: దక్షిణ ముంబైలోని చర్చిగేట్ ప్రాంతంలో ఓ నైజీరియన్ పాదచారులపై విచ్ఛలవిడిగా చెలరేగిపోయాడు.ఈ ఘటనలో 8మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. పార్సీవెల్ సమీపంలోని టాటా గార్డెన్లో జాన్ అనే 50ఏళ్ల నైజీరియన్ వ్యక్తి మహిళతో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా లేచి దాడికి పాల్పడ్డాడు.
కత్తిని బయటకు తీసి దాడి చేయడంతో కనీసం ఎనిమిది మంది గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ముంబై అడిషనల్ కమిషనర్ దిలీప్ సావంత్ తెలిపారు. నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
ఘటనాస్థలంలో రోడ్లపై రక్తపు మరకలు రికాక్డ్ అయిన వీడియోలో కనిపించింది. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి కారణాలు తెలియలేదని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







