కువైట్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

- June 02, 2022 , by Maagulf
కువైట్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

కువైట్ సిటీ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఎన్నారై టిఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.అభిలాష మాట్లాడుతూ ముందుగా తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

కెసిఆర్ చెప్పినట్టు తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాల కోసం అని, నీళ్లు అనేక ప్రాజెక్టులతో తెలంగాణ కళకళలాడుతుంది, నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందని, అలాగే నియామకాల విషయంలో ఇప్పటికే చాలా ఉద్యోగాలు కల్పించి ఇటీవలే దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడ ఇచ్చారని అభిలాష పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో KCR ని ప్రధాన మంత్రిగా చూడాలని టిఆర్ఎస్ ఎన్నారై కువైట్ శాఖ తరపున కోరుకుంటున్నామన్నారు.

తెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షులు వినయ్ మాట్లాడుతూ KTR దావోస్ పర్యటన సందర్భంగా యూరప్ దేశాల్లో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రం గురించి  చర్చించుకుంటున్నారు, అందుకు గాను NRI లుగా మేమందరమూ గర్వపడుతున్నా మన్నారు. యునైటెడ్ తెలుగు ఫోరం అధ్యక్షులు వెంకట్ కోడూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం శాంతిభద్రతల విషయంలో KCR గారు తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు.కొండల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టిఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, తెలంగాణ జాగృతి అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్, యునైటెడ్ తెలుగు ఫోరం అధ్యక్షులు వెంకట్ కోడూరి, కొండల్ రెడ్డి, సురేష్, అయ్యప్ప, సరోజ రెడ్డి, రవి సుధాగాని, మహమ్మద్ దస్తగిరి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com