బాలకృష్ణ వందో సినిమాకు శ్రీకారం..
- April 07, 2016
ఉగాది పర్వదినం సందర్భంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ వందో సినిమాకు శ్రీకారం చుట్టారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ తన వందో చిత్రం వివరాలు వెల్లడించారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలో నటించనున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించనున్నట్లు చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్టీఆర్ తీయాలనుకున్నారు.. కొన్ని కారణాలతో ఆ చిత్రాన్ని తీయలేకపోయారన్నారు. తెలుగువారు తెలుసుకోవాల్సిన చరిత్ర గౌతమి పుత్ర శాతకర్ణి అని వెల్లడించారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







