బాలకృష్ణ వందో సినిమాకు శ్రీకారం..

- April 07, 2016 , by Maagulf
బాలకృష్ణ వందో సినిమాకు శ్రీకారం..

 ఉగాది పర్వదినం సందర్భంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ వందో సినిమాకు శ్రీకారం చుట్టారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ తన వందో చిత్రం వివరాలు వెల్లడించారు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకత్వంలో 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలో నటించనున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించనున్నట్లు చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్టీఆర్‌ తీయాలనుకున్నారు.. కొన్ని కారణాలతో ఆ చిత్రాన్ని తీయలేకపోయారన్నారు. తెలుగువారు తెలుసుకోవాల్సిన చరిత్ర గౌతమి పుత్ర శాతకర్ణి అని వెల్లడించారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com