'అంటే సుందరానికీ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల
- June 03, 2022
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికీ'. ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసింది యూనిట్.
ఇప్పటికే విడుదలైన టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు విడుదలైన ట్రైలర్ 'అంటే సుందరానికీ' చిత్రంపై అంచనాలని భారీగా పెంచింది. సుందర్, లీలా థామస్ పాత్రలో నాని, నజ్రియాల ప్రేమకథ సరికొత్తగా, మ్యాజికల్ గా అనిపిస్తుంది. ట్రైలర్ లో కనిపించిన ప్రతి పాత్ర నవ్వులు పంచింది.
ట్రైలర్ లో చూపించిన 'అంటే సుందరానికీ' కథ నేపధ్యం చాలా ఆసక్తికరంగా వుంది. సుందర్, లీలా వేరు వేరు ప్రపంచాలు. వారి కుటుంబాలు కూడా పూర్తిగా భిన్నం. సుందర్ కి ఒక పెద్ద కల వుంది. దాన్ని సాధించడానికి వాళ్ళే కుటుంబమే పెద్ద అడ్డంకి, ఇది చాలదన్నట్టు లీల, సుందర్ జీవితంలో వస్తుంది. తర్వాత కథ ఎలాంటి ఆసక్తికరమైన మలుపు తిరిగుందో తెలుసుకోవాలంటే 'అంటే సుందరానికీ' చూడాల్సిందే.
ట్రైలర్ లో నాని మార్క్ నటన, టైమింగ్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. సాంప్రదాయ బ్రహ్మణ కుర్రాడిగా అద్భుతంగా కనిపించారు. సుందర్ పాత్రలో అమాయకత్వంతో పాటు చాలా వైవిధ్యం వుంది. లీలా పాత్రలో నజ్రియా స్క్రీన్ ప్రజన్స్ అందంగా వుంది.
దర్శకుడు వివేక్ ఆత్రేయ మార్క్ ఫన్ అడుగడుగునా ఆకట్టుకుంది. రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా కొత్తగా ఆకట్టుకుంది. ట్రైలర్ చివర్లో వచ్చిన టీవీ ఎపిసోడ్ కూడా హైలెట్ గా నిలిచింది. సాంకేతికంగా అత్యున్నత స్థాయి పనితీరు కనిపించింది.
ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల కానుంది.
ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి 'అడాడే సుందరా' అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి 'ఆహా సుందరా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
తారాగణం: నాని, నజ్రియా ఫహద్,అరుణ భిక్షు,నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు.
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ వై
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సిఈవో: చెర్రీ
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైన్: అనిల్, భాను
పీఆర్వో: వంశీ, శేఖర్
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







