పవన్ కళ్యాణ్‌తో శృతిహాసన్: జాక్‌పాట్ కొట్టినట్లే.!
- June 03, 2022
హరీష్ శంకర్‌కి కాస్త సెంటిమెంటు ఎక్కువే. ఆ మాటకొస్తే, సినీ ఇండస్ర్టీలో అందరికీ అది కాస్త ఎక్కువే. హిట్ ఇచ్చిన కాంబినేషన్లు మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తుంటారు. ఇప్పుడెందుకీ టాపిక్ అంటారా.? హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్ ‘భవదీయుడు భగత్ సింగ్’.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకి హీరోయిన్ పెద్ద చర్చగా మారిందిప్పుడు. సినిమా అనుకున్నప్పుడే హీరోయిన్‌గా పూజా హెగ్దేనీ ఫిక్స్ అయిపోయాడు హరీష్ శంకర్. కానీ, తెర వెనుక ఏమైందో ఏమో కానీ, పూజా హెగ్దే, ఈ ప్రాజెక్టుకు హ్యాండిచ్చిందని ప్రచారం జరుగుతోంది.
ఆ ప్రచారం విషయంలో హరీష్ శంకర్ కూడా గమ్మునున్నాడు. ఖండించడం కానీ, మినిమమ్ రెస్పాండ్ అవ్వడం కానీ చేయలేదు. దాంతో వేరే హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రష్మికా మండన్నా అని కొందరు, కాదు కాదు శృతిహాసన్ అని ఇంకొందరు ప్రచారం లేవనెత్తారు.
రష్మిక సంగతి పక్కన పెడితే, శృతిహాసన్ విషయంలో డైరెక్టర్ కూడా సుముఖంగా వున్నట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. గతంలో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో రూపొందిన ‘గబ్బర్ సింగ్’ సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ‘కాటమరాయుడు’ నిరాశ పరిచినా, ‘వకీల్ సాబ్’ ప్రతికూల పరిస్థితుల్లోనూ బంపర్ హిట్ కొట్టింది.
సో, ఆ లెక్కల్లో చూస్తే మళ్లీ శృతిహాసన్‌నే తీసుకుంటే మంచిదేమో అనే అభిప్రాయంలో హరీష్ వున్నాడని టాక్. అదే జరిగితే, శృతిహాసన్ పంట పండినట్లే. ఆల్రెడీ బాలయ్యతో ఓ సినిమా, మెగాస్టార్ చిరంజీవితో ఇంకో సినిమాలోనూ నటిస్తోంది శృతిహాసన్. ఈ ఛాన్స్ కూడా దక్కితే జాక్ పాట్ కొట్టినట్లే.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







