ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల వాయిదా
- June 04, 2022
అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూశారు. ఎంతసేపటికీ వెబ్ సైట్ల లో ఫలితాలు విడుదల కాకపోవడంతో వారంతా ఉత్కంఠగా గడిపారు.
పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో ఫలితాలు విడుదలవుతాయని చెప్పారు. ఫలితాల విడుదల వాయిదా పడటానికి కారణం ఏమిటనేది వెల్లడి కానప్పటికీ… సాంకేతిక కారణాల వల్లే వాయిదా పడినట్టు తెలుస్తోంది.
మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ సారి గ్రేడింగ్ రూపంలో కాకుండా, మార్కుల రూపంలో ఫలితాలను వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







