నవతరం స్వర చక్రవర్తి ...!

- June 04, 2022 , by Maagulf
నవతరం స్వర చక్రవర్తి ...!

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చెబితే ఇప్పటికీ మన గొంతులో గుబులు పుడుతుంది.కోవిడ్‌ కారణంగా ఎందరో మన ప్రఖ్యాత జాతి రత్నాలను కోల్పోయాము మరియు వారిలో ఆయన ఒకరు. కేవలం గాయకుడు మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి.ఈరోజు ఆయన 77వ జయంతి.ఈ సందర్భంగా ఆయన గురించి క్లుప్తంగా మీ కోసం.

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం లో ప్రముఖ హరికథకుడు శ్రీపతి పండితరాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించిన బాలసుబ్రహ్మణ్యం అనంతపురం జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ సీటు వచ్చినప్పటికీ వ్యక్తిగత కారణాలతో మద్రాస్ లో  ఎ.ఎం.ఐ.ఇ పూర్తి చేసి ఇంజినీర్ హోదా అందుకున్నారు. 

బాల సుబ్రహ్మణ్యం కి చిన్నతనం నుంచి సంగీతం మీద ఎంతో మక్కువ, ఎటువంటి శాస్త్రీయ సంగీతం లో ప్రవేశం లేకుండానే గాయకుడిగా సినీరంగ ప్రవేశం చేసి ఎన్నో మరుపురాని పాటలను అందించారు.  

 బాలసుబ్రహ్మణ్యం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ చిత్రాలలో పనిచేశారు మరియు ఎప్పటికప్పుడు గొప్ప భారతీయ గాయకులలో ఒకరిగా పరిగణించబడ్డారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు, 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులు మరియు ఎన్టీఆర్ జాతీయ అవార్డులతో సహా తన కెరీర్‌లో అనేక ప్రశంసలు పొందారు. ఇళయరాజా మరియు రెహమాన్‌లతో కలిసి  సుదీర్ఘ కాలం పనిచేయడంతో వారి ఆస్థాన గాయకుడిగా ప్రసిద్ధి చెందిన SPB 16 విభిన్న భాషలలో 40,000  పాటలు పాడారు. 

బాల సుబ్రహ్మణ్యం లాంటి భారతదేశం గర్వించదగ్గ గొప్ప గాయకుడు మన తెలుగు వారు కావడం మనకు ఎంతో గర్వకారణం.ఈనాడు బాలు భౌతికంగా మన ముందు లేనప్పటికీ ఆయన పాడిన పాటల ద్వారా ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు.

--వెంకట అరవింద్.డి(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com