బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ కు కోవిడ్ పాజిటివ్

- June 04, 2022 , by Maagulf
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ కు కోవిడ్ పాజిటివ్

అబుధాబి: ఎటువంటి అండదండలు లేకుండా స్వశక్తితో బాలీవుడ్‌లో ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్. 'ప్యార్ కా పంచ్ నామా', 'లుకా చప్పీ', 'పతి, పత్నీ ఔర్ వో', 'లవ్ అజ్ కల్-2' తదితర సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు.

ఐఫా అవార్డ్స్ -2022లో కూడా ప్రదర్శన ఇవ్వాలి. అయితే, అంతకు ముందే ఆయనకు షాక్ తగిలింది. ఈ స్టార్ నటుడికీ కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన తెలిపారు. కోవిడ్ పాజిటివ్ అని ఇన్‌స్టాస్టోరీలో రాశారు.

కార్తిక్ ఆర్యన్ తాజాగా నటించిన చిత్రం 'భూల్ భూలయ్యా-2'. కియరా అడ్వాణీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఏప్రిల్ 20న విడుదలైంది. కొత్త సినిమాలు విడుదలవుతున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూనే ఉంది. ఇప్పటికే రూ.130కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో నిర్వహకులు ఐఫాలో కార్తిక్ ఆర్యన్‌ ప్రదర్శనను ప్లాన్ చేశారు. కానీ, కరోనా పాజిటివ్ అని తేలాడంతో ఆ ప్రణాళికలన్ని విఫలం అయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com