బాలీవుడ్ తారల కోలాహలంలో ఐఫా 2022

- June 04, 2022 , by Maagulf
బాలీవుడ్ తారల కోలాహలంలో ఐఫా 2022

అబుధాబి: అబుధాబిలో ఐఫా 2022 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతియేటా అబుధాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ సహకారంతో భారతీయ చలనచిత్ర అకాడమీ మరియు అవార్డ్స్ (IIFA)సంస్థ  సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ ఐఫా రాక్స్ 2022 వేడుకల్లో చలనచిత్ర పరిశ్రమకు చెందిన అందాల తరాల యొక్క స్టేజ్ ప్రదర్శనలు మరియు ఇతరత్రా కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. 

ఈ కార్యక్రమానికి ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరా ఖాన్ మరియు నటుడు అపరశక్తి ఖురానా వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా , ఐఫా లో సంగీతానికి ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న నేపథ్యంలో దేవిశ్రీప్రసాద్, తనిష్క్ బగ్చి , గురు రాంధ్వ, హనీ సింగ్, నేహా కక్కర్  వంటి పలువురు సినీ సంగీత ప్రముఖులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు.  

సినిమాటోగ్రఫీ , స్క్రీన్ ప్లే , ఎడిటింగ్ , కొరియోగ్రఫీ , మాటలు , సౌండ్ డిజైన్ , సౌండ్ మిక్సింగ్ , నేపథ్య సంగీతం(background score)మరియు విజువల్ ఎఫెక్ట్స్ వంటి 9 సినీ సాంకేతిక రంగాలకు సంబంధించి ఈ యేడు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని విజేతలుగా ప్రకటించి అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. 

ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణ తెచ్చేందుకు భాగంగా ఏర్పాటు చేసిన నెక్సా ఫ్యాషన్ వీక్ 2022లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ ఫాల్గుణి , షేన్ పికాక్ లు రూపకల్పన చేసిన అందమైన దుస్తులను ధరించి మోడల్స్ ర్యాంప్ వాక్ చేయనున్నారు. 

ఐఫా 2022 విజేతల జాబితా : 

సర్ధార్ ఉధమ్ - 3అవార్డులు 

1. సినిమాటోగ్రఫీ - అవిక్ ముఖోపాధ్యాయ 

2. ఎడిటింగ్ - చంద్ర శేఖర్ ప్రజాపతి 

3. విజువల్ ఎఫక్ట్స్ - NY విఎఫ్ఎక్స్ వాలా , ఎడిట్ ఎఫ్ఎక్స్ స్టూడియోస్ , సూపర్ 8 / BoJP 

ఆత్రాoగి రే - 2 అవార్డులు 

1. చకా చక్ సాంగ్ కొరియోగ్రఫీ - విజయ్ గంగూలీ 
2. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - ఏ.ఆర్.రెహ్మాన్ 

షేర్ షా - 1 అవార్డు 

1. స్క్రీన్ ప్లే - సందీప్ శ్రీవత్సవా 

తప్పడ్ - 1 అవార్డు 

1. డైలాగ్ - అనుభవ్ సిన్హా , మృణమయి లాగో 

తన్హాజి - ఆన్ సంగ్ వారియర్ - 1 అవార్డు 

1. సౌండ్ డిజైన్ - లోచన్ కన్వడే 

83 - 1 అవార్డు 

1. సౌండ్ మిక్సింగ్ - అజయ్ కుమార్ , మణిక్ బత్రా 


ఐఫా రాక్స్ 2022 కార్యక్రమానికి స్పోర్ట్స్ బజ్ డాట్ కామ్ , నెక్సా ఫ్యాషన్ , రాజశ్రీ ఇలాచీ , జోష్ యాప్, ఉష్ వాషింగ్ పౌడర్, ఈజీ మై ట్రిప్, యూఏఈ కి చెందిన Fnp సంస్థ వంటి పలు సంస్థలు ప్రధాన స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నాయి. 

ఐఫా కార్యక్రమంలో తో ప్రధాన భాగస్వామిగా ఉన్న స్పోర్ట్స్ బజ్ డాట్ కామ్ సంస్థ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని చెబుతూనే. తమ సంస్థ క్రీడా రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థ అని, ఎప్పటికప్పుడు వివిధ క్రీడలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించడంలో ముందుంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com