జూలై 1 నుంచి మారుతున్న కొత్త లేబర్ చట్టాలు ఇవే..!
- June 10, 2022
న్యూ ఢిల్లీ: భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే..ఇప్పుడు మరో కొత్త చట్టాన్ని అమల్లొకి తీసుకొని రానుంది.పాత లేబర్ చట్టాల స్థానంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కార్మిక చట్టాలను తేవాలని ఆలోచిస్తుంది.
కొత్త చట్టాలు అమల్లోకి వస్తే కార్యాలయ పని వేళలు, జీతం, ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వంటి వాటిలో చాలా మార్పులు వస్తాయి. కొత్త సంస్కరణల ద్వారా లేబర్ కోడ్ వేతనాలు, సామాజిక భద్రత (పెన్షన్, గ్రాట్యుటీ), కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, భద్రత, పని పరిస్థితులకు సంబంధించిన నిబంధనలు ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కొత్త చట్టాలు జూలై 1 నుంచి వచ్చే అవకాశం ఉందని సమాచారం..
కొత్త కార్మిక చట్టంలోని అంశాలు..
1. కార్యాలయ పని వేళల్లో పూర్తిగా మారిపోతాయి.8-9 గంటల నుంచి 12 గంటలకు పెంచవచ్చు. ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లు ఉండే అవకాశం ఉంది.
2. పరిశ్రమల్లో కార్మికులకు గరిష్ట ఓవర్‌టైమ్ 50 గంటల నుండి 125 గంటలకు పెరుగుతుంది.
3. ప్రాథమిక వేతనాన్ని స్థూల జీతంలో 50%గా ఉండవచ్చు. జీతాల పెరుగుదలలో మార్పులు వస్తాయి.
4. ఉద్యోగుల PF ఖాతాల్లో నగదు భారీగా పెరుగుతుంది.
5. పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం పెరగడం వలన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత మెరుగైన జీవితాన్ని గడపగలుగుతారని ప్రభుత్వం యోచిస్తుంది.
6. సెలవుల అర్హత సంవత్సరంలో 240 రోజుల నుంచి 180 రోజులకు తగ్గుతుంది. అంటే ప్రతి 20 రోజుల పనికి 1 రోజు సెలవు ఉంటుంది..
ఈ కొత్త చట్టాల వలన ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. వీలైనంత త్వరగా ఈ కోడ్ ను అమల్లొకి తీసుకురావాలని భావిస్తున్నారు.కొత్త కార్మిక చట్టాల వల్ల దేశంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది..
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







