రెడ్‌లైట్ జంపింగ్: భారతీయ వలసదారుడికి జైలు
- April 09, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఓ భారతీయ వలసదారుడికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 10,000 ఖతారీ రియాల్స్ ఫైన్ కూడా విధించింది. దాంతోపాటుగా నెల రోజులపాటు డ్రైవింగ్ లైసెన్స్‌నీ రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. రాత్రి వేళ వాహనం నడుపుతూ డి-రింగ్‌రోడ్ వద్ద రెడ్ లైట్‌ని జంప్ చేస్తూ చిక్కాడు. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు ఆ వ్యక్తి. ఓ పోలీస్ ఈ విషయాన్ని గమనించి, అతన్ని నిలువరించాడు. వెంటనే పోలీస్ పెట్రోల్స్ ఘటనా స్థలికి చేరుకున్నాయి. నిందితుడికి జరిపిన పరీక్షల్లో అతను మద్యం సేవించి ఉన్నట్లు తేలింది. 2014లో భారతీయ ముస్లిం వ్యక్తి కూడా ఇలాగే పట్టుబడగా అతనికి రెండు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్‌ని రద్దు చేశారు. అతని కార్‌లో సగం ఖాళీ అయిన మద్యం బాటిల్ దొరికింది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి విషయంలో ఖతార్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







