'రెడ్ సీ' మీదుగా సౌదీ, ఈజిప్ట్ మధ్య బ్రిడ్జ్
- April 09, 2016
రెడ్ సీ మీదుగా ఈజిప్ట్ - సౌదీ అరేబియా మధ్య బ్రిడ్జ్ నిర్మాణం కానుంది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా వెల్లడించింది. కింగ్ సల్మాన్ అబ్దుల్ అజీజ్ ఆఫ్ సౌదీ అరేబియా, ఐదు రోజుల ఈజిప్ట్ పర్యటనలో ఈ ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్యా నెలకొన్న చారిత్రక సంబంధాల్ని ఇంకా మెరుగుపరిచేందుకు ఈ బ్రిడ్జ్ తోడ్పాటునందిస్తుందని ఆయన చెప్పారు. ఈజిప్టియన్ స్ట్రాంగ్ మేన్ హోస్నీ ముబారక్ చొరవతో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి గతంలోనే ఆలోచనలు జరిగాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది సౌదీ పర్యాటకులు ఈజిప్ట్ని సందర్శిస్తుంటారు. అలాగే వేలాది మంది ఈజిప్టియన్లు సౌదీ అరేబియా సందర్శించడం జరుగుతుంది. ఈ కారణంగా ఇరు దేశాల మధ్యా సాంస్కకృతిక బంధం అలాగే వ్యాపార బంధం బలోపేతానికి తగు చర్యలు తీసుకుంటామని ఇరు దేశాల ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







