రాష్ట్రపతి ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం
- June 10, 2022
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలపై సీఎం కేసీఆర్ సమావేశం ప్రారంభమైంది.హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు.రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అలాగే తాజా దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపారు. నిన్న ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ తో అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలు, దేశ రాజకీయాలపై, పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ చర్చించారు.
బీజేపీ యేతర రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అంశంపై చర్చించినట్లు సమాచారం. ప్రగతి భవన్ లో జరుగుతున్న తాజా మీటింగ్ లో ఈ అంశాలపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







