రన్ వే అభివృద్ధి పనులు అద్భుతం: జూన్ 22న పునఃప్రారంభం

- June 11, 2022 , by Maagulf
రన్ వే అభివృద్ధి పనులు అద్భుతం: జూన్ 22న పునఃప్రారంభం

యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నార్తన్ రన్ వే పనులు సజావుగా సాగుతున్నాయి. జూన్ 22న యధాతథంగా పునఃప్రారంభం జరుగుతుందని అథారిటీస్ పేర్కొనడం జరిగింది. అంతా అనుకున్నట్టే పనులు అవుతున్నాయనీ, పనుల ప్రగతిలో మంచి వేగం కనిపిస్తోందని అథారిటీస్ తెలిపాయి. మే 9 నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. 1,000కి పైగా వాహనాలు, 3,000 మంది సిబ్బంది ఈ పనుల్ని రోజులో 24 గంటలూ పని చేస్తున్నారు. ఏవియేషన్ గ్రౌండ్, ఎయిర్ నావిగేషన్ సెన్సార్లు, మిటియరాలాజికల్ ఎక్విప్మెంట్, మెయిన్ కారిడార్ల ప్రవేశం, నిష్క్రమణలు, సీవేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి పనులు జరుగుతున్నాయి. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. 2014లో కూడా ఈ రన్ వే మీద నిర్వహణ పనులు సమర్థవంతంగా నిర్వహించారు. వారానికి సుమారు 1000 విమానాల్ని నిర్వహణ పనుల నిమిత్తం దారి మళ్ళించారు. 45 రోజులపాటు నిర్వహణ పనులు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com