రూటు మార్చిన అక్కినేని బుల్లోడు: ఈ సారైనా సక్సెస్ అవుతాడా.?
- June 11, 2022
అక్కినేని బుల్లోడు నాగ చైతన్య మొదట్నుంచీ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూనే వున్నాడు. కానీ, వర్కవుట్ కావడం లేదు. కెరీర్ తొలి నాళ్లలోనే మాస్ ఇమేజ్‌ని సొంతం చేసుకోవడానికి తెగ వెంపర్లాడాడు. కానీ, ప్రయత్నించిన ప్రతిసారీ ఫెయిలవుతూనే వచ్చాడు.
ఈ మధ్య ‘వెంకీ మామ’, ‘బంగార్రాజు’, ‘లవ్ స్టోరీ’ చిత్రాలతో వరుస హిట్లు కొట్టి చైతూ ఫుల్ స్వింగ్‌లో వున్నాడు. కెరీర్ పీక్స్‌లో వున్న టైమ్‌లోనే ప్రయోగాలు చేస్తే బాగుంటుందని చైతూ భావిస్తున్నాడట. ఆ కోణంలోనే వెంకట్ ప్రభుతో చైతూ చేయబోయే సినిమా మాస్ కంటెంట్‌లో వుండబోతోందనీ తెలుస్తోంది.
అలాగే, ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌ని చైతూ లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పక్కా మాస్ బ్యాక్ డ్రాప్లోనే వుండబోతోందనీ ఇన్ సైడ్ లీక్.
గతంలో చైతూ, ‘బెజవాడ’ తదితర సినిమాలతో మాస్ ట్రెండ్ ట్రై చేశాడు. బొక్క బోర్లా పడ్డాడు. ఈ సారి అలా కాకుండా జాగ్రత్త పడేందుకు కొన్ని సర్ప్రైజింగ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడట. మేకోవర్‌లో మార్పులతో పాటు, బాడీ లాంగ్వేజ్‌లోనూ కొత్తదనం చూపించేందుకు చైతూ తాపత్రయ పడుతున్నాడట. ఈ సారైనా చైతూ కష్టం ఫలిస్తుందో లేదో చూడాలిక.
మరోవైపు చైతూ నటించిన ‘థాంక్యూ’ మూవీ త్వరలో రిలీజ్‌కి రెడీగా వుంది. రాశీ ఖన్నా ఈ సినిమాలో చైతూకి జోడీగా నటిస్తోంది. అన్నట్లు రాశీఖన్నా, చై జోడీ ‘వెంకీ మామ’ సినిమాలో సందడి చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







