అక్షయ్ కుమార్ సినిమాకి అంతటి ఘోర అవమానమా.?

- June 11, 2022 , by Maagulf
అక్షయ్ కుమార్ సినిమాకి అంతటి ఘోర అవమానమా.?

బాలీవుడ్‌కి దిష్టి తగిలింది. ఈ మధ్య బాలీవుడ్‌లో రిలీజవుతున్న ఏ సినిమా కూడా సక్సెస్ కాలేకపోతోంది. దాంతో బాలీవుడ్  బాక్సాఫీస్ విలవిల్లాడిపోతోంది. అందుకేనేమో సౌత్ సినిమాలపై బాలీవుడ్ ఫోకస్ బాగా ఎక్కువైంది. మొన్న‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్ అక్కడ బాగా వసూళ్లు రాబట్టింది.

దాంతో కాస్త ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్, ఇప్పుడు మళ్లీ ఢీలా పడింది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్వీరాజ్’ సినిమా ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హిందీతో పాటు, తెలుగులో కూడా ఈ సినిమా రిలీజైంది.
ఢిల్లీ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్ర ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. అసలే కష్టాల్లో వున్న బాలీవుడ్.. అందునా ఈ టైమ్‌లో ఇలాంటి చారిత్రక నేపథ్యం వున్న సినిమాలు ఆడియన్స్ పల్స్‌ని టచ్ చేయగలవా.? ‘బాహుబలి’ రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది.

కానీ, ప్రోమోస్ చూస్తే, ఆ క్వాలిటీ ఏమంత కనిపించలేదు సినిమాలో. ఆ ప్లేవర్ కూడా అంత ఎట్రాక్టివ్‌గా లేదు. అందుకే, ‘పృథ్వీరాజ్’ ఫ్లాప్ అయ్యిందా.? ఓ మోస్తరు వసూళ్లు కూడా చేయలేదీ సినిమా. అంతేకాదు, కొన్ని ధియేటర్స్‌లో జనాల్లేక సినిమాని లేపేశారట కూడా.
నిజంగా స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కి ఇది తీరని అవమానమే. కానీ, ఏం చేస్తాం. ప్రేక్షకుల ఆలోచనలు పూర్తిగా మారిపోయాయ్. ఏ సినిమా ఎప్పుడు.? ఎలా.? ఎందుకు.? హిట్టవుతుందో, జనానికి నచ్చుతుందో అర్ధం కావడం లేదు. ఆ పల్స్‌ని క్యాచ్ చేయగలిగితే, సినిమా హిట్‌కి కంటెంట్‌తో అస్సలు పని లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com