మహిళలు జుట్టు, మెడను కవర్ చేయాలి: సౌదీ

- June 12, 2022 , by Maagulf
మహిళలు జుట్టు, మెడను కవర్ చేయాలి: సౌదీ

సౌదీ: సౌదీ అరేబియాలోని మహిళలు సివిల్ స్టేటస్ ఐడీ కార్డ్ ఫోటోలలో తమ జుట్టు లేదా మెడను చూపించవచ్చనేది నిజం కాదని రాజ్యంలోని సివిల్ స్టేటస్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మహ్మద్ అల్-జాసర్ తెలిపారు. సివిల్ స్టేటస్ ఐడీ కార్డుల కోసం మహిళలు తమ జుట్టు,  మెడలను ఫోటోలలో కవర్ చేయడం తప్పనిసరి అని ఆర్టికల్ 17తో పాటు పౌర హోదా వ్యవస్థ నిబంధనలకు సవరణలను మంత్రి మండలి ఆమోదించిందన్నారు. 10 -14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు, వృద్ధ మహిళలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు అల్-జాసర్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com