మీ ఇంటికి రోడ్డు కావాలా.. యాప్‌లో దరఖాస్తు చేసుకోండి
- June 12, 2022
దుబాయ్: నివాసితులు తమ ఇంటికి తాత్కాలిక రహదారి కోసం స్మార్ట్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రోడ్లు, రవాణా అథారిటీ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నివాసితులు తమ ఇంటికి తాత్కాలిక గ్రావెల్ రోడ్డు వేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చని అందులో తెలిపారు.Mahboub–RTA వర్చువల్ అసిస్టెంట్‌ని ఉపయోగించి తారీజ్ సేవను పొందాలని సూచించారు. ఆరు దశల్లో ఈ సేవను పొందవచ్చని పేర్కొన్నారు. కార్పొరేట్ సేవల స్మార్ట్ యాప్‌ను డౌన్లోడ్ చేసిన తర్వాత నిబంధనలు, షరతులను అంగీకరించాలి. ట్రాఫిక్, రోడ్ల ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ఆపై తారీజ్ పై క్లిక్ చేయాలి. అడిగిన సమాచారాన్ని ఇవ్వాలి. అలాగే అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ఆపై క్లిక్ చేసి దరఖాస్తు కాపీని భవిష్యత్ నిర్ధారణల కోసం సేవ్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







