నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులకు దేశ బహిష్కరణ!

- June 12, 2022 , by Maagulf
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులకు దేశ బహిష్కరణ!

కువైట్ సిటీ: మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు భారత్‌కు అత్యంత కీలకమైన గల్ఫ్‌ దేశాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే.ఖతర్‌,కువైట్, ఒమాన్‌, ఇరాన్‌ దేశాలు భారత రాయబారులను పిలిచి అధికారికంగా తమ నిరసన వ్యక్తం చేశాయి.శుక్రవారం కువైట్ లోని ఫహహీల్ ప్రాంతంలో కొందరు ప్రవాసులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ప్రార్థనల అనంతరం వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అయితే, ఇలా ప్రవాసులు బహిరంగ ప్రదర్శనకు దిగడం అక్కడి చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుందని అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలోనే నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ప్రవాసులందరిని దేశం నుంచి బహిష్కరించనున్నట్లు స్పష్టం చేశారు. 

కువైట్ లో ప్రవాసులు సిట్‌ఇన్‌లు లేదా ప్రదర్శనలు నిర్వహించరాదనే నిబంధనలు దేశ చట్టాల్లో పొందుపరిచారు.ఈ నిబంధనలను ఉల్లంఘించినందున వారిని కువైట్ నుండి బహిష్కరిస్తున్నట్లు సంబంధిత అధికార వర్గాలు ధృవీకరించాయి.ప్రస్తుతం డిటెక్టివ్ అధికారులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నాయి.వారిని  డిపోర్టాషన్ సెంటర్ కు తరలించి అనంతరం అక్కడి నుంచి వారివారి దేశాలకు పంపించనున్నట్లు వెల్లడించారు.అంతేగాక ఇలా దేశ బహిష్కరణకు గురైన ప్రవాసులకు ఇకపై వారి జీవితంలో కువైట్ లో అడుగుపెట్టకుండా నిషేధం విధించడం జరుగుతుందని తెలిపారు.కువైట్‌లోని ప్రవాసులందరూ తప్పనిసరిగా కువైట్ చట్టాలను గౌరవించాలి మరియు ఎలాంటి ప్రదర్శనలలో పాల్గొనకూడదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com