కువైట్ లో భద్రతా తనిఖీలు.. 328 మంది అరెస్ట్

- June 12, 2022 , by Maagulf
కువైట్ లో భద్రతా తనిఖీలు.. 328 మంది అరెస్ట్

కువైట్: వాఫ్రా, మినా అబ్దుల్లాలో చేపట్టిన భద్రతా తనిఖీల సందర్భంగా వీసా గడువు ముగిసిన 162 మందిని అహ్మదీ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. వీరిలో 145 మంది వ్యక్తులు వర్క్ పర్మిట్‌ల గడువు ముగిసిన తర్వాత దేశంలో నివసిస్తుండగా.. 11 మంది పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే మరో 6 మంది అసాధారణ స్థితిలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నాలుగు ట్రాఫిక్ నోటీసులు జారీ చేశారు. ఇద్దరు బూట్‌లెగ్గర్‌లను అరెస్టు చేయడంతో పాటు, వీరి నుండి అమ్మకానికి సిద్ధంగా ఉన్న 60 స్థానికంగా తయారు చేసిన బూజ్(booze) బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఫర్వానియా గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్, డైరెక్టర్ ఆఫ్ సెక్యూరిటీ పర్యవేక్షణలో నిర్వహించన తనిఖీల్లో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన 109 మందితో సహా 166 మందిని అరెస్టు చేయగా.. 49 మంది పరారీలో ఉన్నారు. డ్రగ్స్ కలిగి ఉన్నందుకు ముగ్గురు, మద్యం సేవించినందుకు లేదా డ్రగ్స్ సేవించినందుకు నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ షేక్ అహ్మద్ అల్-నవాఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అబ్దుల్ లతీఫ్ అల్-బర్జాస్ సూచనల మేరకు ఈ భద్రతా తనిఖీలు జరుగుతున్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com