షాకింగ్.. అనుష్క సోదరుడి హత్యకు ప్లాన్ ?.. గ్యాంగ్ స్టర్స్ తో సంబంధాలు..
- June 13, 2022
బెంగుళూరు: ప్రముఖ సినీ నటి అనుష్క శెట్టి సోదరుడి హత్యకు కుట్ర పన్నినట్లు సమాచారం. అనుష్కకు ఇద్దరు సోదరులు ఉన్నారు.వీరు గుణరంజన్ శెట్టి, రమేష్ శెట్టి.
అయితే గుణరంజన్ శెట్టి హత్యకు స్కెచ్ వేసినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కర్ణాటకలోని గ్యాంగ్ స్టర్ల మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మంగళూరుకు చెందిన మాఫియా డాన్ ముత్తప్పరై బతికున్నప్పుడు మన్విత్ రై, గుణరంజన్ శెట్టి లు కుడి, ఎడమ భుజంగా ఉండేవారు.
ముత్తప్ప చనిపోయిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. గుణ రంజాన్ శెట్టి హత్యకు మన్విత్ స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. గుణరంజన్ మంగళూరు, బెంగుళూరు ప్రాంతాల్లో చురుగ్గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలే దీనికి కారణమని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్ తనకు భద్రత కల్పించాలని కోరారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







