నితిన్‌కి 20 ఏళ్లు: అలా ఎలా అంటారా.!
- June 14, 2022
‘జయం’ సినిమాతో ఇండస్ర్టీకి హీరోగా పరిచయం అయిన నితిన్, తొలి సినిమాతోనే యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇన్నోసెంట్ అప్పీల్‌తో కుర్రకారును తన వైపుకు తిప్పుకున్నాడు. యంగ్‌స్టర్స్‌కి క్రేజీ హీరోగా మారిపోయాడు.
ఒక్కో సినిమాకీ ఒక్కోరకంగా తనను తాను మేకోవర్ చేసుకుంటూ వచ్చాడు. ‘దిల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు. మొదటి నుంచీ ఒకే ప్యాటర్న్‌కి ఫిక్స్ అయిపోకుండా కెరీర్‌ని చాలా చూజీగా బిల్డప్ చేసుకుంటున్నాడు నితిన్.
అసలు విషయం ఏంటంటే, హీరోగా నితిన్‌కి 20 ఏళ్లు. అదేనండీ.. నితిన్ ఇండస్ర్టీకి పరిచయమై 20 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ రిలీజ్ చేశాడు నితిన్. తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. ఈ 20 ఏళ్లలో ఎంతో పరిణీతి చెందానని నితిన్ చెప్పుకొచ్చాడు.
‘భీష్మ’ సినిమా తర్వాత నితిన్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ ప్రయోగాలు సక్సెస్నా.? ఫెయిల్యూర్‌నా.? అనే విషయం పక్కన పెడితే, కొత్త కొత్త కథలకు శ్రీకారం చుడుతున్నాడు. అలా వచ్చిన సినిమాలే ‘చెక్’ అయినా, ‘రంగ్ దే’ అయినా.
తాజాగా ‘మాచర్ల నియోజక వర్గం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు త్వరలో నితిన్. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. సీరియస్ టోన్‌లో నడవబోతోందని తెలుస్తోంది. నితిన్‌లోని మాస్ యాంగిల్‌ని కొత్తగా ప్రొజెక్ట్ చేయబోతోంది ఈ సినిమా. ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కృతిశెట్టి, నితిన్‌కి జోడీగా నటిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!







