‘చంద్రముఖి 2’ వచ్చేస్తుందహో.!
- June 14, 2022
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తమిళంతో పాటు, తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం దక్కించుకుంది. నయనతార, జ్యోతిక, ప్రభు ఇతర కీలక పాత్రలు పోషించారు.
‘చంద్రముఖి’.. ఇదో ట్రెండ్ సెట్టర్ మూవీగా అభివర్ణించుకోవచ్చు. ఇప్పటికీ ‘చంద్రముఖి’ అంటే అదో వైబ్రేషన్. జ్యోతిక ఆ పాత్రకు అంతలా న్యాయం చేసింది. ప్రాణం పెట్టేసింది. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్ అలాంటిలాంటిది కాదు. ‘చంద్రముఖి’ పాత్రను బేస్ చేసుకుని ఎన్నో మీమ్స్, పేరడీ వీడియోలు.. అలా ఎంత ఎక్కువ చెప్పుకున్నా ఈ పాత్ర గురించి తక్కువే అవుతుంది.
అలాంటి ‘చంద్రముఖి’ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. అదే ‘చంద్రముఖి 2’. వాస్తవానికి ఇది సినిమాకి సీక్వెల్ అనకూడదేమో. టైటిల్ సీక్వెల్ అంతే. హారర్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన లారెన్స్ రాఘవ ఈ సినిమాలో నటిస్తున్నాడు. సీనియర్ దర్శకుడు పి. వాసు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.
‘చంద్రముఖి’ అనగానే ఫీమేల్ లీడ్ రోలే తలపుకు వస్తుంది. మరి, ఆ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు ‘చంద్రముఖి 2’ సినిమాకి అనేది ఆసక్తిగా మారింది. అయితే, ఆ వివరాలు ప్రస్తుతానికి సస్పెన్స్.
అన్నట్లు ‘చంద్రముఖి’ పాత్రలో దివంగత సౌందర్య, శోభన తదితర నటీమణులు నటించి మెప్పించారు వివిధ భాషల్లో. అలాగే, ఈ సినిమాకి సీక్వెల్ అంటూ విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నాగవల్లి’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క, రీచా గంగోపాధ్యాయ తదితరులు ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..







