ప్రవాసులకు వీసా మెడికల్ ఫీజు మినహాయింపు!
- June 15, 2022
మస్కట్: ప్రయివేట్ రంగానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలలో ప్రవాస కార్మికులను వైద్య పరీక్షల రుసుము నుండి మినహాయించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH)కి ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) విజ్ఞప్తి చేసింది. కొత్త వీసాల కోసం వైద్య పరీక్ష తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. 2022 నాటి OCCI ధహిరా గవర్నరేట్ బ్రాంచ్ మూడవ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు OCCI ధహిరా అధిపతి సైఫ్ బిన్ సైద్ అల్ బాడి చెప్పారు. చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు సౌకర్యాలను అందించడానికి OCCI రాయల్ ఆదేశాలకు విలువనిస్తుందన్నారు. ఇది వారి సామర్థ్యాలను, వనరులను మెరుగుపరుస్తుందని, GDPకి వారి సహకారాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుందని ఆయన తెలిపారు. అలాగే గవర్నరేట్లో ప్రైవేట్ రంగ విద్య నాణ్యతను పెంపొందించడానికి - విద్య, నాణ్యత, వృద్ధి - సెమినార్ నిర్వహణను ఆమోదించే తీర్మానాన్ని కూడా సమావేశంలో ఆమోదించినట్లు సైఫ్ బిన్ సైద్ అల్ బాడి తెలిపారు. ప్రవాస కార్మికులందరూ ప్రైవేట్ సెక్టార్ ఆసుపత్రిలో వైద్య పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత MoH RO30 రుసుముతో మెడికల్ సర్టిఫికేట్ను పొందాలి.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







