హజ్ యాత్రకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ తప్పనిసరి

- June 15, 2022 , by Maagulf
హజ్ యాత్రకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ తప్పనిసరి

జెడ్డా: ఈ సంవత్సరం హజ్ చేయడానికి ఆమోదించబడిన COVID19- వ్యాక్సిన్‌లలో ఒకదానిని పొంది ఉండాలని హజ్-ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. మాస్కులు సహా వివిధ కోవిడ్-19 నివారణ చర్యలను ఎత్తివేస్తున్నట్లు సౌదీ అధికారులు ప్రకటించిన 24 గంటల లోపే ఈ నిర్ణయం రావడం గమనార్హం. ఈ సంవత్సరం హజ్ చేయాలనుకునే వారందరూ పబ్లిక్ హెల్త్ అథారిటీ ఆమోదించిన COVID-19 వ్యాక్సిన్‌లలో ఒకదానిని తీసుకొని ఉండాలని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఈ సంవత్సరం హజ్ కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో మార్పులు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. COVID-19 ముందుజాగ్రత్త, నివారణ చర్యల ఎత్తివేతకు సంబంధించిన ఇటీవలి నిర్ణయానికి సంబంధించి.. మక్కా గ్రాండ్ మసీదు, మదీనా ప్రవక్త మసీదు మినహా ప్రజలు ఇకపై మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని అథారిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com