బహ్రెయిన్‌లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ
- June 15, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్-ఖలీఫా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణను చేపట్టారు. చమురు మంత్రి షేక్ మహ్మద్ బిన్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా స్థానంలో వాతావరణ వ్యవహారాలకు దేశ రాయబారిగా ఉన్న మహమ్మద్ బిన్ ముబారక్ బిన్ దైనహ్ ను నియమించారు.ఈ పునర్వ్యవస్థీకరణలో షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాను ఉప ప్రధానమంత్రిగా నియమించారు. అలాగే మౌలిక సదుపాయాల మంత్రి, జాయెద్ బిన్ రషీద్ అల్ జయానీ పరిశ్రమ-వాణిజ్య మంత్రిగా.. ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ ని పర్యాటక మంత్రిగా నియమించారు. దేశ చరిత్రలో అతిపెద్ద పునర్వ్యవస్థీకరణగా ఇది నిలిచింది. మొత్తం 22 మంది మంత్రులలో 17 మందిని బహ్రెయిన్ రాజు మార్చారు. ఇందులో నలుగురు మహిళలు సహా యువ మంత్రులు కొత్త క్యాబినెట్ లో ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







