ఎన్టీయార్ చెప్పాడట. కొరటాల వింటాడా.?
- June 16, 2022
కొరటాల శివ, ఎన్టీయార్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ ఫెయిల్యూర్‌తో ఈ సినిమాపై అంచనాలు కాస్త అటూ ఇటూ వున్నా కానీ, కాంబినేషన్ పరంగా ఫ్యాన్స్‌లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా వున్న సినిమా ఇది.
‘ఆచార్య’ ఇంపాక్ట్‌తో ఈ సినిమా విషయంలో అడుగడుగునా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట కొరటాల శివ. ఆ సంగతి అటుంచితే, ‘ఆచార్య’ టైమ్‌లో కొరటాల శివ తన సోషల్ మీడియా అకౌంట్‌ని డీ యాక్టివేట్ చేసేసిన సంగతి తెలిసిందే.
‘ఆచార్య’ రిజల్ట్ సెగను తట్టుకోలేకే, కొరటాల శివ తన సోషల్ మీడియా అకౌంట్‌ని డీయాక్టివేట్ చేసేశారు. ఇంతవరకూ ఆ అకౌంట్ యాక్టివ్ చేయలేదు. అయితే, ఇప్పుడు ఆ అకౌంట్‌ని యాక్టివ్ చేయమని కొరటాలకు ఎన్టీయార్ సూచిస్తున్నాడట.
కానీ, నెగిటివిటీ నుంచి తప్పించుకోవడం కష్టమని కొరటాల భయపడుతున్నాడట. నెగిటివిటీ వుంటేనే, మనల్ని మనం మార్చుకోవడానికి అవకాశం వుంటుంది.. అని ఎన్టీయార్ కొరటాలకు అర్ధమయ్యేలా చెబుతున్నాడట. అదీ నిజమే, నెగిటివిటీని కూడా పాజిటివ్‌గా తీసుకోగలిగితేనే మంచి ఫలితాల్ని అందుకోవచ్చు.
అఫ్కోర్స్.. కొరటాల శివ అది గ్రహించలేనంత తెలివి తక్కువోడేం కాదు. కానీ, రిస్క్ చేయలేకపోతున్నాడు. ఏమో, ఎన్టీయార్ సూచనల మేరకు తన సోషల్ మీడియా అకౌంట్‌ని తిరిగి తెరుస్తాడేమో చూడాలి మరి. ఇక, ఈ ప్రాజెక్టు అయితే, ఆగస్టులో సెట్స్ మీదికెళ్లే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







