కీలక నిర్ణయం తీసుకున్న రానా: నిజంగానే అలా చేస్తాడా.?

- June 16, 2022 , by Maagulf
కీలక నిర్ణయం తీసుకున్న రానా: నిజంగానే అలా చేస్తాడా.?

రానా అంటేనే ప్రయోగాలకు పెట్టింది పేరు. తొలి సినిమా ‘లీడర్’ నుంచీ తీసుకుంటే, రానా కెరీర్‌లో ప్రయోగాలకే పెద్ద పీట వేశాడు. ‘బాహుబలి’ సినిమాతో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు రానా. అందులో సక్సెస్ అయ్యాడు కూడా.

నిజానికి రానాకి గుర్తింపు దక్కిందే ఆయన ప్రయోగాత్మక సినిమాల వల్ల. అలాంటిది తాజాగా రానా ఇకపై ప్రయోగాలు చేయనని ‘విరాట పర్వం’ తన లాస్ట్ సినిమా అనీ చెప్పేశాడు. అంటే రానా ఇకపై పక్కా కమర్షియల్ సినిమాల్లోనే నటించబోతున్నాడన్న మాట.

రానాకి ఇది వర్కవుట్ అవుతుందా.? నిజానికి రానా గతంలోనూ కమర్షియల్ ట్రాక్ ట్రై చేశాడు. ‘నా ఇష్టం’ తదితర సినిమాలు ఆ కోవలోకి చెందినవే. ఆ టైమ్‌లో వరుసగా ఇలాంటి రిస్క్‌లే చేశాడు రానా. కానీ, బొక్క బోర్లా పడ్డాడు.

దాంతో ట్రాక్ మార్చేసి, తనకది వర్కవుట్ అవ్వదనుకున్నాడు కాబోలు. తొందరగానే తప్పు తెలుసుకున్నాడు. మళ్లీ విలక్షణ పాత్రల వైపు మొగ్గు చూపాడు. ఆటోమెటిగ్గా రానాకి సక్సెస్ రావడం స్టార్ట్ అయ్యింది.

అలాంటిది ఇప్పుడు మళ్లీ ఫెయిల్యూర్ ట్రాక్ వైపు వెళ్తానని కమిట్ అవుతున్నాడెందుకు.? భళ్లాల దేవా.! ఇది చాలా పెద్ద రిస్క్ ఏమో..  జర శోచాయించరాదే.! అంటూ ఆయన డై హార్ట్ అభిమానులు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట రానాకి. మరి, రానా ఇది స్వీకరిస్తాడా.? చూడాలిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com