తెలంగాణను తాకిన అగ్నిపథ్ సెగ..
- June 17, 2022
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేక ఆందోళన తెలంగాణకు పాకింది.శుక్రవారం ఉదయం ఆందోళన కారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు.
'అగ్నిపథ్' రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్లోకి దూసుకొచ్చిన కొందరు యువకులు పలు రైళ్లకు నిప్పు పెట్టి దహనం చేశారు. 'సేవ్ ఆర్మీ' అంటూ నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్లోని షాపులు, సీసీ కెమెరాలు, ఫర్నీచర్, అద్దాలు సహా అనేక ఆస్తులను ధ్వంసం చేశారు.
రైలు పట్టాల మధ్య నిప్పు పెట్టారు.పట్టాలపై సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు వేసి రైళ్లు కదలకుండా చేశారు. రైల్వేకు చెందిన పార్శిళ్లను కూడా ఆందోళనకారులు దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బంది, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు. మరోవైపు స్టేషన్లోని ప్రయాణికులను పోలీసులు బయటకు పంపేశారు. సికింద్రాబాద్ రావాల్సిన, వెళ్లాల్సిన రైళ్లను అధికారులు రద్దు చేశారు.
పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 'అగ్నిపథ్' రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని యువకులు అంటున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ పాత విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







