తెలంగాణ కరోనా అప్డేట్
- June 17, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. దేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలోనూ కొవిడ్ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో మరోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య రెండు వందలు (279) దాటింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 27వేల 841 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 279 కొవిడ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా హైదరాబాద్ లో 172 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 62, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 24గంటల వ్యవధిలో మరో 119 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరట కలిగించే విషయమేంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటిదాకా 7లక్షల 95వేల 572 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7లక్షల 89వేల 980 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 1,781 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల రాష్ట్రంలో నేటివరకు 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ శుక్రవారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 13న 126 కరోనా కేసులు రాగా, 14న ఒక్కసారిగా డబుల్ సెంచరీ మార్కుని(219) అందుకున్నాయి. ఈ నెల 15న 205 కరోనా కేసులు వచ్చాయి. ఈ నెల 16న 285 కొవిడ్ కేసులు వచ్చాయి. 300లకు చేరువగా కొవిడ్ కేసులు నమోదవడం టెన్షన్ పెడుతోంది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఫోర్త్ వేవ్ భయాలను తలుచుకుని ప్రజలు వణికిపోతున్నారు. కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







