మిడ్ డే బ్రేక్ ఆవశ్యకతను తెలియజేసేందుకు ప్రత్యేక డ్రైవ్

- June 18, 2022 , by Maagulf
మిడ్ డే బ్రేక్ ఆవశ్యకతను తెలియజేసేందుకు ప్రత్యేక డ్రైవ్

యూఏఈ: మిడ్ డే బ్రేక్ రూల్ నేపథ్యంలో హీట్ స్ట్రెస్ మేనేజిమెంట్ ప్రోగ్రామ్ అబుదాబీలో ప్రారంభమయ్యింది. మధ్యాహ్నపు ఎండ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేయడం వల్ల కలిగే అనర్థాల గురించి ఈ కార్యక్రమంలో ఆయా సంస్థల యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరటైజేషన్, జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3 గంటల వరకు వర్క్ బ్యాన్ విధించింది. ఈ మేరకు అబుదాబీ పబ్లిక్ హెల్త్ సెంటర్, స్పష్టమైన నిబంధనల్ని జారీ చేసింది. కార్మికులు అలాగే యజమానులకు మిడ్ డే వర్క్ బ్యాన్‌పై అవగాహన కల్పించేలా పలు చర్యలు చేపడుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com