రికార్డు స్థాయిలో రోడ్డు మార్గాన ఖతార్‌కు టూరిస్టులు

- June 19, 2022 , by Maagulf
రికార్డు స్థాయిలో రోడ్డు మార్గాన ఖతార్‌కు టూరిస్టులు

దోహా: 'ఈద్ ఇన్ ఖతార్' కింద గత నెలలో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లు, ప్రచారాలు టూరిస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాయి. టూరిస్టు డిపార్టుమెంట్ వెల్లడించిన డేటా ప్రకారం.. మే నెలలో ఖతార్ కు వచ్చిన మొత్తం టూరిస్టుల్లో సగానికి పైగా (54%) జీసీసీ దేశాల నుంచి వచ్చారు. ముఖ్యంగా సౌదీ అరేబియా నుండి వచ్చిన సందర్శకులు సంఖ్య అధికంగా ఉంది. ఖతార్ కు వచ్చిన సందర్శకులు అత్యధికం రోడ్డు మార్గాన్ని ఎంచుకోవడం విశేషం. మొదటిసారిగా రోడ్డు మార్గాన వచ్చిన సందర్శకుల సంఖ్య విమానంలో వచ్చిన వారి సంఖ్యను మించడం గమనార్హం. మే నెలలో అంతర్జాతీయ రాకపోకలు 166,000 దాటాయి. ఇది 2022లో అత్యధిక సంఖ్యలో సందర్శకులను వచ్చిన నెలగా రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఖతార్ ను తమ టూరిస్టు స్పాట్ గా ఎంచుకోవడం సంతోషానిస్తుందని ఖతార్ టూరిజం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బెర్తోల్డ్ ట్రెంకెల్ అన్నారు. తమ దేశానికి మెరుగైన విమాన సౌకర్యం ఉన్నా.. చాలా మంది జీసీసీ దేశాల ప్రజలు రోడ్డు మార్గాన ఖతార్ కు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com