అమెజాన్ డెలివరీ స్కామ్.. టీడీఆర్ఏ హెచ్చరికలు
- June 19, 2022
యూఏఈ: నకిలీ అమెజాన్ డెలివరీ స్కామ్‌ల పట్ల జాగ్రత్త వహించాలని ప్రభుత్వ అధికారులు నివాసితులను హెచ్చరించారు. ఈ మేరకు యూఏఈ టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ(TDRA) వారి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో డెలివరీ స్కామ్ ల పట్ల నివాసితులకు అవగాహన కల్పించారు. అమెజాన్ నుండి ఆర్డర్ చేసినట్లు నటిస్తూ కొంతమంది మీకు లింక్‌తో SMS పంపుతారని, ఆ లింక్ క్లిక్ చేయగానే వారి వ్యక్తిగత సమాచారాన్ని పూరించమని అడుగుతారని అందులో వివరించారు. అపరిచిత లింక్ లను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని SMS లింక్‌ల ద్వారా పంచుకోవద్దని కోరింది. సరైన వివరాల కోసం Amazon యాప్ లేదా వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి నిర్ధారించుకోవాలని అవగాహన వీడియోలో సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







