మంగళవారం ఈ ఏడాదిలోనే సుదీర్ఘమైన పగటి సమయం
- June 20, 2022
యూఏఈ: యూఏఈలో స్ప్రింగ్ సీజన్(శీతాకాలం) నేటితో అధికారికంగా ముగుస్తోంది.రేపటి నుంచి సమ్మర్ సీజన్(వేసవికాలం) ప్రారంభం కానుంది. ఎమిరేట్స్ ఆస్ట్రనామికల్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ ఇబ్రహీం అల్ జర్వాన్ వెల్లడించిన వివరాల ప్రకారం, స్ప్రింగ్ సీజన్ ముగిసిందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సుమారు మూడు నెలలపాటు వేసవి వుంటుందని ఆయన తెలిపారు. జూన్ 21న వేసవి ప్రారంభం కానుండగా, సుమారు 14 గంటలపాటు పగటి సమయం తొలి రోజు వుంటుందని అన్నారు. ఈ ఏడాదిలో ఇదే సుదీర్ఘమైన పగటి సమయం. పగటి పూట ఉష్ణోగ్రత ఎక్కువగా వుంటుంది. కొన్ని చోట్ల ఆకాశం మేగావృతమై వుండొచ్చు. శుక్రవారం తేలికపాటి వర్షం కురిసే అవకాశం వుంది. ఈ సీజన్లో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవ్వొచ్చు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







